AP: సిబ్బంది సంక్షేమం కోసం రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి పోలీస్ ఉద్యోగికి వారి పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని DGP ఆదేశించారు. కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. పని ఒత్తిడి తగ్గించి, కుటుంబంతో సమయం గడిపేలా ఈ వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయం పట్ల పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.