MDCL: అల్వాల్లో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్వాల్ సర్కిల్ కార్యాలయం ముందు నిర్వహించిన “అలైవ్ అరైవ్” రహదారి భద్రత కార్యక్రమంలో సీఐ ప్రశాంత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.