MNCL: మంచిర్యాల – అంతర్గామ్ మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మించాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరై టెండర్లు పూర్తయినా ప్రస్తుత ఎమ్మెల్యే కమీషన్ రాదని పనులు రద్దు చేశారని ఆరోపించారు.