SRH బౌలర్ బైడన్ కార్స్ గాయంతో IPL-2026 మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతని స్థానాన్ని శ్రీలంక లెఫ్టార్మ్ పేసర్ దిల్షాన్ మధుషంకతో భర్తీ చేస్తున్నట్లు ఫ్రాంఛైజీ ప్రకటించింది. లెఫ్టార్మ్ పేసర్‌గా పవర్‌ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగల నైపుణ్యం అతనికి ఉంది. మధుషంక రాకతో జట్టు బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుందని మేనేజ్మెంట్ ధీమాగా ఉంది.