BHPL: రేగొండ మండలంలో రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి వాసుదేవరెడ్డి నేడొక ప్రకటనలో తెలిపారు. అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో మొత్తం 100 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను సిద్ధంగా ఉంచామన్నారు.క్వింటా పూర్తి ధర రూ. 16,350 కాగా, ప్రభుత్వ 50% రాయితీ పోను రూ. 8,175 కి అందిస్తున్నామన్నారు.