HNK: నడికూడ మండల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లో మండలంలోని కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన క్రికెట్ జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఫైనల్కు దూసుకెళ్లింది. కంఠాత్మకూర్ జట్టులో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.