NRPT: కర్ణాటక- తెలంగాణ రాష్ట్రాల మధ్య జల విషయాల గురించి నిన్న ఇరు రాష్ట్రల మంత్రులు సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. కాగా ఈ సమావేశంలో కృష్ణ మండలంలోని కోల్పూర్ నుంచి కర్ణాటకలోని రాయచూరు జిల్లా కోర్కొండ గ్రామం వరకు బ్యారేజీతో పాటు వంతెన నిర్మించాలని ప్రతిపాదన వచ్చినట్లు, దీనికోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.