BDK: అశ్వాపురం మండల ప్రజలు వేసవి ఎండల నుంచి రక్షించు కొనుటకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తహసీల్దార్ సూర్య ప్రకాష్ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం 10 గంటలు దాటిందంటే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఈ వేడి, వడగాలుల నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆసుపత్రి పాలు కావడం లేదా ప్రాణాంతకం కావచ్చు అని తెలిపారు.