BHPL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TRP) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. భూపాలపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు ప్రారంభించారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రవి పటేల్ పిలుపునిచ్చారు.