BHPL: మహదేవపూర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థిని సువైబా తస్నీమ్ ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా టాపర్గా నిలిచింది. ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో 985 మార్కులు సాధించిన ఆమెను కళాశాల యాజమాన్యం, స్థానిక ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో చదువుతూ జిల్లా టాపర్గా నిలవడం ఈ గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.