ATP: రాయదుర్గం పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. అనంతపురం క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. కనేకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి విద్యుత్ అంతరాయాల వల్లే పంపింగ్ సమస్యలు వస్తున్నట్లు అధికారులు వివరించారు.