NLG: ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరిగింది వాస్తవమేనని, అందుకు ప్రభుత్వం తరఫున రైతులకు క్షమాపణ కోరుతున్నామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు నియోజకవర్గంలో ఆయన ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.. మిల్లర్ల సమస్యలు, హమాలీలు, లారీల కొరత వల్లే ధాన్యం సేకరణ ఆలస్యమైందని వివరించారు.