ASR: యువతలో సాహస వృత్తి, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించేందుకు ట్రెక్కింగ్ క్యాంప్ దోహదపడుతుందని కలెక్టర్ నిశాంతి అన్నారు. సోమవారం అరకులోయలో 600 మంది ఎన్సీసీ క్యాడెట్లతో నేషనల్ ట్రెక్కింగ్ క్యాంప్‌ను ఆమె ప్రారంభించారు. ఈ నెల 31 వరకు వారం రోజుల పాటు ఈ క్యాంప్ కొనసాగుతుందన్నారు. ఈ ట్రెక్కింగ్ క్యాంప్‌ను అరకులో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు.