PPM: పాలకొండ మండలం పణుకువలస గ్రామంలో మహిళ మృతి ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన శిర్లి సరస్వతి (50) ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఆమె కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.