KMM: తల్లాడ మండలంలోని మల్లారం రైతు వేదికలో ఇవాళ ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఏఈవో సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. మల్లవరం, బాలంపేట గ్రామాల రైతులందరూ ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా హాజరై, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.