BHPL: రేగొండ, గోరి కొత్తపల్లి మండలాల్లోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎస్సై సుధాకర్ సోమవారం పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన ఆయన కాంటాలు వేగంగా నిర్వహించి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ఎస్సై, హమాలీల సంఖ్య పెంచాలని, త్వరగా అన్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.