NLG: భూముల మార్కెట్ విలువల నవీకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవనంలో సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు.