వరంగల్ నగరంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన 26 మందిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి వరంగల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రాజ్ నిధి రూ. 28,200 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. సుజాత తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఆమె సూచించారు.