ఈ ఏడాది ఐపీఎల్లో బ్యాటర్లు ఊచకోత కోశారు. రికార్డు స్థాయిలో 9.85 రన్ రేటుతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 61 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదు కాగా.. మరో 16 సార్లు భారీ లక్ష్యాలను జట్లు విజయవంతంగా ఛేజ్ చేశాయి. పిచ్‌లు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అండతో బ్యాటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు.