KDP: కేంద్ర మహిళా,శిశు అభివృద్ధి శాఖ అందించే ‘PM రాష్ట్రీయ బాల్ పురస్కార్-2027’ కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ సోమవారం తెలిపారు. ధైర్యం,సామాజిక సేవ,పర్యావరణం, క్రీడలు, కళలు, సాంకేతికత రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 ఏళ్ల పిల్లలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు జూలై 31లోపు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.