శ్రీకాకుళంలోని తండేవలస వద్ద ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ మహేశ్వర రెడ్డి సోమవారం సాయంత్రం సందర్శించారు. అక్కడ శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లతో ముఖాముఖి మాట్లాడారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, చట్టాలపై అవగాహన, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని ట్రైనీలకు ఎస్పీ సూచించారు.