NLG: జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు ముందే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వేదిక, టెంట్లు, తాగునీరు, ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు సజావుగా సాగాలన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, ప్రజల సౌకర్యార్థం కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ముగించాలన్నారు.