NLR: సోమశిల జలాశయం తాజా నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద రావడం లేదు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా 49.306 TMCల నీరు నిల్వ ఉంది. 12వ క్రస్ట్ గేట్ ద్వారా 1750, పవర్ టన్నెల్ ద్వారా 1800 క్యూసెక్కుల నీరు పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు. కావలి కాలువకు 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.