MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం వెళ్లే మార్గంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తు రోడ్డుపై తుమ్మచెట్టు విరిగిపడింది. దీంతో పగలు, రాత్రి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, బాటసారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై పడిన చెట్టును తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.