BHPL: రేగొండ మండలం రేపాకపల్లిలో పంట వ్యర్థాల దహనం ఘటనలో రైతు దంపతులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై సంబంధిత జిల్లా, మండల వ్యవసాయ అధికారుల నుంచి రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి సంజాయిషీ కోరుతూ సోమవారం నోటీసులు జారీ చేశారు. పర్యవేక్షణ లోపం కారణంగానే ఘటన జరిగినట్లు నోటీసులో పేర్కొంది.