GNTR: జిల్లాలో అధికారులు 565 విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేసినట్లు ఉప రవాణా కమిషనర్ కె.సీతారామిరెడ్డి తెలిపారు. వీటిలో భద్రతా ప్రమాణాలు పాటించని 187 వాహనాలకు నోటీసులు ఇచ్చామన్నారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు తమ బస్సులకు తప్పనిసరిగా తనిఖీలు చేయించి భద్రతా సర్టిఫికెట్ తీసుకోవాలని ఆయన ఆదేశించారు.