PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని వైటీసీ శిక్షణ కేంద్రం వద్ద నాలుగు రోజుల క్రితం వర్షానికి భారీ చెట్టు కూలి ప్రధాన ద్వారాన్ని అడ్డగించింది. అక్కడ గర్భిణీల హాస్టల్‌తో పాటు శిక్షణ తరగతులు కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున చెట్టును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.