E.G: బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని ఎస్పీ నరసింహ కిషోర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన స్వయంగా 31 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో సివిల్, కుటుంబ కలహాలు, చీటింగ్, కొట్లాటలకు సంబంధించిన కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.