SRD: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులకు పటాన్ చెరు కోర్టు రెండు రోజుల జైలు శిక్ష, వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు పటాన్ చెరు సీఐ అశోక్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఆయన సూచించారు.