సత్యసాయి: కనుమ అటవీ ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సైలు నరేంద్ర, శ్రీధర్ సిబ్బందితో కలిసి సంయుక్తంగా తనిఖీలు చేశారు. అటవీ మార్గంలో సంచరిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అక్రమ రవాణాపై దృష్టి సారించారు.