SRPT: మోతే మండలం రాఘవపురం వద్ద జరిగిన కారు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. హైవేపై ఉన్న రోడ్డు లోపాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం నివారణకు వాహనదారులు సీటుబెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మోతే పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఆయన, కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు.