WG: మేత ధరల పెరుగుదల, వ్యాపారుల సిండికేట్‌తో రొయ్యల రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. 15 రోజుల వ్యవధిలోనే 100 కౌంట్ రొయ్యల ధర రూ. 270 నుంచి రూ. 210కి పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి వ్యయం పెరుగుతుండగా, మరోవైపు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ధరల నియంత్రణలో ఆశించిన మేర ప్రయోజనం కలగడం లేదని రైతులు వాపోతున్నారు.