అన్నమయ్య: శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండగను జరుపుకోవాలని K.V పల్లె SI వెంకట శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా చట్ట విరుద్ధంగా గోవధకు పాల్పడినా,నిషేధిత జంతువులను బలి ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.