TG: నాగర్కర్నూల్ కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ, పెండింగ్ పనులపై సమీక్ష జరపనున్నారు. పనులు తొందరగా పూర్తి కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ భేటీకి జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, మల్లు రవి హాజరుకానున్నారు.