TG: KTR పాదయాత్రకు ముందు కల్వకుంట్ల కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ఎలాంటి పాలన చేసిందో ప్రజలకు తెలుసని అన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క లెక్కలతో సమాధానాలు చెప్తే.. కేసీఆర్ బ్యాచ్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు.