MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల నుండి రాత్రి వేళల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. జేసీబీలు, టిప్పర్ల సహాయంతో ఈ దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. కొండాపూర్ సమీపంలో జరుగుతున్న ఈ అక్రమ రవాణాను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.