SS: లేపాక్షి షోరూమ్‌లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మూల వేతనాలపై 10 శాతానికి పైగా జీతాలు పెంచుతున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను లేపాక్షి ఉద్యోగులు మంగళవారం కలిసి పలు సమస్యలను వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న లేపాక్షి షోరూమ్‌లలో అమ్మకాలను మరింత పెంచాలని ఉద్యోగులకు సూచించారు.