AP: ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే.. YCPని గొడ్డలి పార్టీ అని TDP ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఇప్పటి నుంచే జగన్ను ఓడించేందుకు చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టిలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని, ఐదేళ్ల తర్వాత చంద్రబాబు పనితీరుపై ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.