ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు, మహిళా రక్షణపై సీఐ రామకృష్ణ మంగళవారం వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్డుల్లోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉండాలన్నారు.