NRPT: దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పాల్గొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఆడపిల్లలను చదివించి, 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలని కోరారు.