NGKL: లింగాల మండలం రాయవరం గ్రామంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉండడంతో, గ్రామ సర్పంచ్ పబ్బతి శ్రీను యాదవ్ చొరవ తీసుకొని మంగళవారం నూతన ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించడం జరిగింది. ఇది గమనించిన గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివానందన్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.