NLG: ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో చిట్యాల పట్టణానికి చెందిన విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. కన్నబోయిన తపస్వి, మహేశ్వరం బృంద, బొబ్బల రక్షిత అనే ముగ్గురు విద్యార్థినులు 470కి గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నిలిచారు. వేర్వేరు కళాశాలల్లో చదువుతున్న వీరు ఈ ఘనత సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.