మార్కాపురంలోని RTC బస్టాండ్‌ను స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలోని పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అదేవిధంగా క్యాంటీన్ నిర్వహిస్తున్న తీరును, ప్రయాణికులు బస్టాండులో కలుగుతున్న అసౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో RTC డీఎం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.