BHPL: భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటామని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. టేకుమట్ల, చిట్యాల మండలాల్లో ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను గండ్ర పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిత్యం ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గండ్ర తెలిపారు.