MDK: రామాయంపేటలో ‘పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు’ అంటూ ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి నాటిన మొక్కలు నేడు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. విద్యుత్ లైన్ల సాకుతో అధికారులు పచ్చని చెట్లను తొలగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ ఇచ్చే వృక్షాలను ఇలా నరికితే పర్యావరణం దెబ్బతింటుందని, పెంచడం ఎందుకు? నరకడం ఎందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.