MLG: సాకలి వాగుపై వంతెన నిర్మాణం కోరుతూ కోయ వీరాపురం గ్రామ ప్రజలు ఏటూరునగరంలోని ప్రజా దర్బార్లో వినతి పత్రం సమర్పించారు. వర్షాకాలంలో వాగు ఉప్పొంగి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని తెలిపారు. విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులకు వివరించారు. తుడుం దెబ్బ కమిటీ సభ్యులు సమస్య తీవ్రతను వెల్లడించారు.