KMR: జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. మధ్యాహ్నం వేళ వడగాలులు వీచుతూ తారు రోడ్లపై ఎండమావులు కనిపిస్తున్నాయి. ఆరెంజ్ జోన్లో ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించి, తరచూ నీరు తాగుతూ అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు.