KRNL: ఆదోనిలో మహాయోగి లక్ష్మమ్మ నగర్లో రూ.15.50 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు కూటమి నాయకులు సోమవారం భూమిపూజ చేశారు. జనసేన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ, టీడీపీ నేత రామకృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలంలో మురికినీరు నిలిచే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని నేతలు పేర్కొన్నారు.