ADB: మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్లో పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆయన, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం ప్రాణాపాయమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా పెద్దలు బాధ్యతగా ఉండాలని సూచించారు.