AKP: కోటవురట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఓ పేషంట్‌కు సర్జన్ డాక్టర్ రవికిరణ్ ఇవాళ ఆపరేషన్ చేసి 1.50 కిలోల కణితిని తొలగించారు. పెదబొడ్డేపల్లికి చెందిన ఎం పార్వతి (57) ఎడమ తుంటి భాగంలో కణితి ఏర్పడింది. దీంతో స్థానిక సీ.హెచ్.సీ.లో చేరింది. డాక్టర్ పరీక్షించి ఆపరేషన్ అవసరమని గుర్తించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ సహాయంతో ఆపరేషన్ చేశారు.